Saturday, May 25, 2013

నాకేం


ఆమె నా ఆలోచన.......ఎవరి ఆలోచల్లో ఆమె ఉంటే నాకేం
ఆమె నా మొదటి చివరి ప్రేమ కావ్యం ఎవరు జపిస్తే నాకేం
ఆమె నా కంటి కనుపాప ఎందరి కళ్ళుపడితే మాత్రం నాకేం
ఆమె నా ప్రతిబింబాన్నిచూపే అద్దం ఎవరో మోహిస్తే నాకేం
ఆమె నా జీవితాశయ గమ్యం ఎందరికో ఆదర్శమైతే నాకేం
ఆమె కేవలం నాకుమాత్రమే సొంతం ఎవరు కావాలంటే నాకేం
ఆమె నా కొనఊపిరైతే చాలు.....నా జీవితం అంతమైనా నాకేం

7 comments:

  1. wow.. simply superb Aniketh..

    ఇంత ధీరోదాత్తంగా ఎలా రాయగలిగావో.. అభినందనలతో...

    ReplyDelete
  2. నాకేం అని అలా ఉండిపోతే ఎలా అనికేత్:-)

    ReplyDelete
  3. నాకేం అని సరిపెట్టుకోక తప్పదు

    ReplyDelete
  4. నిర్లక్ష్యంలో కూడ ఒక లక్ష్యం ..very nice

    ReplyDelete
  5. నాకు అనిపించినది మీ కవిత రూపంలో ఆవిష్కరించారు. The feelings i was not able to express were reflected by u. Keep writing. All the best.

    ReplyDelete
  6. అనికేత్ గారు, చాలా చాలా బాగుందండి. ఇలా ఆలోచించే వాళ్ళు చాలా అరుదు. Really loved it. అభినందనలు

    ReplyDelete
  7. ఆసాంతం అవధులు లేని ప్రేమ...
    beautifully woven...

    అభినందనలు...

    ReplyDelete