Saturday, December 14, 2013

గుర్తున్నాయి


గుర్తున్నాయి నీవులేక గడిచిన నిన్నమొన్నలు

ఓడినపోయిన ఓటములు, గెలిచిన విజయాలు!

గుర్తున్నాయి నీతోగడిపిన కొన్ని అపూర్వక్షణాలు

వచ్చిపోయిన వసంతాలు నీవులేని ఎండమావులు!

గుర్తున్నాయి నీవు ఆప్యాయంగా తాకిన స్పర్శలు

చలిలో ఊపిరిపోసుకున్న వేడిఉఛ్ఛ్వాస నిఛ్ఛ్వాశలు!

గుర్తున్నాయి నా తడారిన పెదాలపై నీ తీపిసంతకాలు

కనులతో కనులుకలిపి భావాలను వెతికిన నీ లోతట్లు!

గుర్తున్నాయి అన్ని నీవు లేనపటి ఈ క్షణాలు తప్ప....

Sunday, November 10, 2013

పొమ్మంది

చదవడం రాయడం నేర్చి చాన్నాళ్ళైంది
మనసు నొప్పించక మాట్లడ్డమే రాకుంది

అనురాగ అల్లికల బాల్యపుస్తకం బాగుంది
లోకజ్ఞానాన్ని చదవడమే ఇంకా నేర్వకుంది

ఆదర్శాలని గమ్యాన్ని పోసిస్తూనే పెరిగింది
నలుగితోపాటు గంతలుకట్టుకుని నడవనంది

గాయపడ్డ హృదయం లోకాన్ని వెలివేసింది
అనామకంగా చావడానికైన సిధ్ధమే అనంది

నటించడం నేర్చుకుందామంటే తెలియకుంది
లోకానికి అర్థమయ్యే తాహతేలేదు పొమ్మంది


 

Thursday, October 31, 2013

ఆమె

ఆమె పెదవి నా పెదవి తాకిన వేళ
ముద్ద మింగకుండానే ఆకలి తీరింది

ఆమె అలవోకగా ప్రేమించాను అనిచెప్పి
తప్పు చేయాకుండానే ఖైధీగా బంధించేసింది

ఆమె తన కౌగిలో నన్ను బంధించిన వెంటనే
ప్రాణం పోలేదు కాని జీవితం స్వర్గాన్ని చేరింది

Saturday, October 5, 2013

ఆమె ఆయుధం

 
కాదంటూ ఒకసారి అవునని మరోసారి అలిగేవు
ఏదేమైనా అలిగిన నిన్ను బుజ్జగించడం ప్రియం

పొమ్మని రమ్మనే నీ ప్రేమతో ఊపిరి సలపనీయవు
ఎలాగన్నా నీవు నాపై చూపే అనురాగం అమోఘం

స్నేహమే కాని ప్రేమకానే కాదు పో పోరా అంటావు
ఎందుకో ఏమో అలా అంటుంటే నాకు నీవు ప్రత్యేకం

మితభాషినైన నా మాటల్లో ప్రేమకి సాక్ష్యం వెతికేవు
ఏం వెతికినా నీ కళ్ళలో కనిపించే వెలుగే నాకు జీవం

అభిమానులందరిలో నా ప్రేమని నీవు నమ్మకున్నావు
ఎంత వద్దనుకున్నా కావాలనిపించేలా ఉండేదే నీ గుణం

కోపం వస్తే ప్రాణం తీస్తానని బాకులు బాణాలు అడిగేవు
అలా చేయాలనుకుంటే నీ ఛీత్కారమే దానికి ఆయుధం!

Monday, September 23, 2013

చూస్తున్నాప్రియురాలి పేరిట ఒక లేఖ రాశాను
ఆశలన్నింటినీ అందులో గుప్పిస్తూ
ఒంటరిగా ఉన్నప్పుడు చదవమంటూ
ఒక్కో పదంలో ప్రేమనంతా ఒలకబోస్తూ
లిఖించాను మదిలోనిమాట ఇదేనంటూ
గుండెలయకి తనపేరు మాత్రమే వినిపిస్తూ
సందేశం పంపాను రివ్వున వచ్చి వాలమంటూ
ప్రేమ కావ్యానికి పచ్చతోరణాలు తొడిగేలా ఆశిస్తూ
కనులుకాయిస్తున్నా మంచికాలం ముందుందంటూ

Saturday, August 17, 2013

నాతోడు


జీవితపు ఒడిలో సేదతీరుతూ కోరికంది
నేను ఎప్పుడు పరిపూర్ణత చెందుతానని
జీవితం నవ్వుతూ కోరిక తలనిమిరంది
పరిపూర్ణమైతే నీ రూపురేఖలుండవని*

జీవితానికి జీవించాలన్న ఆశ పెరిగింది
ఇతరులతో పోల్చుకోక మారిపోయానని
నన్ననుసరించే వారిని చూసి నవ్వింది
నాలోని కోరికలకి నేనే కళ్ళెం వేసానని*

జీవితపు మార్గాన్న ముళ్ళని ఏరమంది
స్నేహం శత్రుత్వము వేరొకరితో ఎందుకని
పరిపూర్ణతకి నాతోనన్నే జూదమాడమంది
ధైర్యాన్ని తోడంపింది గమ్యాన్ని చేరాలని*

Saturday, July 20, 2013

ఎలా జీవించను


నేను అక్కడ ఉంటే నన్ను ఇక్కడ వెతక్కు
చెల్లాచెదురై చిందిన అదృష్టాన్ని పోగుపెట్టకు
కొత్తప్రేమ కధను ఉల్లాసంగా ఎలా లిఖించను
వ్యధసిరాకలంతో హాస్యాన్ని ఏం పండించను
గుండె ఇక్కడుండి ఎక్కడో ఎగసిపడుతుంటే
శ్వాస ఆడుతూ జీవించి మరణించి నేనుంటే
జీవితాన్నే శిక్షగాఇచ్చి విధివ్రాతని వెక్కిరించకు
అందమైన జీవితముందని ఆశను కలిగించకు

Saturday, May 25, 2013

నాకేం


ఆమె నా ఆలోచన.......ఎవరి ఆలోచల్లో ఆమె ఉంటే నాకేం
ఆమె నా మొదటి చివరి ప్రేమ కావ్యం ఎవరు జపిస్తే నాకేం
ఆమె నా కంటి కనుపాప ఎందరి కళ్ళుపడితే మాత్రం నాకేం
ఆమె నా ప్రతిబింబాన్నిచూపే అద్దం ఎవరో మోహిస్తే నాకేం
ఆమె నా జీవితాశయ గమ్యం ఎందరికో ఆదర్శమైతే నాకేం
ఆమె కేవలం నాకుమాత్రమే సొంతం ఎవరు కావాలంటే నాకేం
ఆమె నా కొనఊపిరైతే చాలు.....నా జీవితం అంతమైనా నాకేం

Tuesday, May 14, 2013

ఏమిటో?

నీవు రావు నేనుండలేను
దారి మళ్ళిందో గమ్యమిదికాదో?

కళ్ళుమూసి ముఖం చిట్లిస్తావు
ప్రశ్నలంటే చాలా బెదురు నీకు!!!
వెలుగుని చూసి కళ్ళుమూస్తావు
చీకటి అంటే అతి ప్రియం నీకు!!!

ఆమె తలపులతో మరణించను
ఎవరిని తలుస్తూ తపిస్తున్నానో!!!
మరణించి కూడా నే జీవిస్తాను
అనుక్షణం ఆమె తలంపులలో!!!

Thursday, April 11, 2013

నీవడిగావు

జీవితం ఏమిటని నీవడిగావు?
నీవు లేనిది జీవితమే లేదని!
భాధేమని మరల ప్రశ్నించావు?
నాతో నీవులేని జీవితమే అదని!
ప్రేమంటే ఏమిటని నీవడగావు?
నాలో నీపై ఉన్నదంతా అదేనని!
దైవం అంటే ఏమిటని అడిగావు?
నేను కొలిచే ప్రేమదేవతవే నీవని!
ప్రేమించావెందుకని ప్రశ్నించావు?
నేనన్నాను అది నాక్కూడా తెలీదని!
ఎందుకింత తపన నేనంటే అన్నావు?
తెలిపా నేరం నాదికాదు నామనసుదని!

Saturday, March 30, 2013

జిజ్ఞాస...


చదవడం వ్రాయడం నేర్చుకున్నా
అక్షరాలతో  ఊసులే అల్లుతున్నా
అయినా మనసెందుకో వికశించదు
సరైన గమ్యం ఏదో నాకు తెలియదు
భావ వ్యక్తీకరణకు సాధనాలు తెలీవు
ప్రణాలికతో పదాలు పేర్చినా అమరవు
ఇది నా అవగాహనా లోపమనుకుంటా
అందుకే పదేపదే నన్ను నే తిట్టుకుంటా
నేర్వాలన్న జిజ్ఞాసతో మళ్ళీ ప్రయత్నిస్తా
మెప్పించే కవితని ఎప్పటికైనా నే లిఖిస్తా!

Friday, March 8, 2013

నీవు రావా!

చెక్కిలి నిమిరిన చేతులే
శూన్యంలోకి తోసేసాయి
కరుణ చూపిన నయనాలే
అగ్ని కణాలై వర్షించాయి
నవ్వులు చిందిన అధరాలే
మౌనంగా బంధించేసాయి
గడిపిన మధుర క్షణాలే
స్మృతులై వేధిస్తున్నాయి
చెలిమి నీడలు నన్నంటి
నీకై ఎదురు చూస్తున్నాయి

Tuesday, February 5, 2013

దూరం

దూరాల భారం మనకి అడ్డంకి కాదు
మనోఊసులకు దూరమర్మమే లేదు
నీ ప్రేమ వ్యసనానికి నేను బానిసను
అందుకే నలుగురిలో ఒంటరినైనాను

దూరాన్న ఉండి నా ఎదకి దగ్గరైనావు
ఇలా ఎలా నా ఎదని దోచేయగలిగావు
ఏ మంత్రమేసి నన్ను మాయ చేసావో
నేను నేనుగా కాక నీకు సొంతమైనాను

దూరమైనానని నా ప్రేమను కాదనకు
నాస్వఛ్ఛమైన ప్రేమని నీవు మరువకు
అనురాగాన్ని ఆకతాయి అల్లరనుకోకు
కలనైనా నన్ను వదిలేసి వెళ్ళిపోకు....

Thursday, January 10, 2013

అంతా భ్రాంతి

నేను ఆలోచిస్తున్నది అంతా భ్రాంతియేనా!
నా బుర్ర ఒక అంతుచిక్కని ప్రశ్నల ఖజాన
భగవంతుడొక్కడే రూపాలు అనేకమెందుకు
మానవులంతా ఒకటైతే ఈ జాతిబేధాలెందుకు
నాదన్న స్వార్థముంటే ప్రగతిని సాధించగలమా
మనమంతా నేను నుండి మేముగా మారలేమా
పుట్టి పెరిగి పోయే ఈ మూడ్నాళ్ళ ముచ్చటలో
మధ్యలో పెరగడంపైనే మనకి ప్రాముఖ్యతెందుకో!
చివరికి మనం మోసుకెళ్ళేదంతా శూన్యమైయితే
నాది నాది అంటూ ఈ తగని పోరాటం ఎందుకంట
లేనోడు లేకేడిస్తే ఉన్నోడికింకా కావాలని ఉరుకులాట
ఈ ప్రాకులాటలో సుఖాన్ని మరచి దుఃఖానికి చేరువై
జీవితాన్నిసాగిస్తూ దుఃఖంలో సుఖానికై వెదుకులాట!!!