Tuesday, February 5, 2013

దూరం

దూరాల భారం మనకి అడ్డంకి కాదు
మనోఊసులకు దూరమర్మమే లేదు
నీ ప్రేమ వ్యసనానికి నేను బానిసను
అందుకే నలుగురిలో ఒంటరినైనాను

దూరాన్న ఉండి నా ఎదకి దగ్గరైనావు
ఇలా ఎలా నా ఎదని దోచేయగలిగావు
ఏ మంత్రమేసి నన్ను మాయ చేసావో
నేను నేనుగా కాక నీకు సొంతమైనాను

దూరమైనానని నా ప్రేమను కాదనకు
నాస్వఛ్ఛమైన ప్రేమని నీవు మరువకు
అనురాగాన్ని ఆకతాయి అల్లరనుకోకు
కలనైనా నన్ను వదిలేసి వెళ్ళిపోకు....

4 comments:

  1. అనికేత్ నీ ప్రేమకావ్యం బాగుంది

    ReplyDelete
  2. నీ ప్రేమ వ్యసనానికి నేను బానిసను
    అందుకే నలుగురిలో ఒంటరినైనాను
    ....

    ఇంత హృద్యంగా ఎలా రాసేసారు అనికేత్..
    మీ భావ వెల్లువకు హేట్సాఫ్.. కంగ్రాట్స్..

    ReplyDelete
  3. దూరంగా ఉన్నా మీతోనే ఉన్నాక ఇంక విడిచే ప్రసక్తే లేదులెండి:-)




    ReplyDelete
  4. చాలా బాగుంది అనికేత్......keep on writing

    ReplyDelete