Friday, March 8, 2013

నీవు రావా!

చెక్కిలి నిమిరిన చేతులే
శూన్యంలోకి తోసేసాయి
కరుణ చూపిన నయనాలే
అగ్ని కణాలై వర్షించాయి
నవ్వులు చిందిన అధరాలే
మౌనంగా బంధించేసాయి
గడిపిన మధుర క్షణాలే
స్మృతులై వేధిస్తున్నాయి
చెలిమి నీడలు నన్నంటి
నీకై ఎదురు చూస్తున్నాయి

4 comments:

  1. ఎడబాటా అనికేత్ :-)


    ReplyDelete
  2. యువ విరహ గీతం బాగుంది అనికేత్...

    ReplyDelete
  3. విరహం తొ నిండిన కవిత ..బాగుంది అనికేత్

    ReplyDelete
  4. ప్చ్...ఇదంతా విరహమేనా?

    ReplyDelete