Thursday, January 10, 2013

అంతా భ్రాంతి

నేను ఆలోచిస్తున్నది అంతా భ్రాంతియేనా!
నా బుర్ర ఒక అంతుచిక్కని ప్రశ్నల ఖజాన
భగవంతుడొక్కడే రూపాలు అనేకమెందుకు
మానవులంతా ఒకటైతే ఈ జాతిబేధాలెందుకు
నాదన్న స్వార్థముంటే ప్రగతిని సాధించగలమా
మనమంతా నేను నుండి మేముగా మారలేమా
పుట్టి పెరిగి పోయే ఈ మూడ్నాళ్ళ ముచ్చటలో
మధ్యలో పెరగడంపైనే మనకి ప్రాముఖ్యతెందుకో!
చివరికి మనం మోసుకెళ్ళేదంతా శూన్యమైయితే
నాది నాది అంటూ ఈ తగని పోరాటం ఎందుకంట
లేనోడు లేకేడిస్తే ఉన్నోడికింకా కావాలని ఉరుకులాట
ఈ ప్రాకులాటలో సుఖాన్ని మరచి దుఃఖానికి చేరువై
జీవితాన్నిసాగిస్తూ దుఃఖంలో సుఖానికై వెదుకులాట!!!

4 comments:

  1. Nice, bagaa cheppaavu

    ReplyDelete
  2. చాలా చాలా బాగుంది

    ReplyDelete
  3. మీకొచ్చే డౌట్స్ నాకూ వస్తాయి ఎందుకు?:)

    ReplyDelete
  4. అంతరంగం లోని ఆలోచనల ఆరాటం మీ కవిత ...బాగా రాసారు ...ఆల్ ది బెస్ట్ ..

    ReplyDelete