Thursday, April 11, 2013

నీవడిగావు

జీవితం ఏమిటని నీవడిగావు?
నీవు లేనిది జీవితమే లేదని!
భాధేమని మరల ప్రశ్నించావు?
నాతో నీవులేని జీవితమే అదని!
ప్రేమంటే ఏమిటని నీవడగావు?
నాలో నీపై ఉన్నదంతా అదేనని!
దైవం అంటే ఏమిటని అడిగావు?
నేను కొలిచే ప్రేమదేవతవే నీవని!
ప్రేమించావెందుకని ప్రశ్నించావు?
నేనన్నాను అది నాక్కూడా తెలీదని!
ఎందుకింత తపన నేనంటే అన్నావు?
తెలిపా నేరం నాదికాదు నామనసుదని!

2 comments:

  1. కాస్త కంఫూజ్ గా ఉంది.

    ReplyDelete
  2. మీ సమాధానాలతో ఆమె చిర్నవ్వుల ఆమనిలా అల్లుకుని వుంటుంది అనికేత్..:-)
    Nice lines..

    ReplyDelete