Saturday, July 20, 2013

ఎలా జీవించను


నేను అక్కడ ఉంటే నన్ను ఇక్కడ వెతక్కు
చెల్లాచెదురై చిందిన అదృష్టాన్ని పోగుపెట్టకు
కొత్తప్రేమ కధను ఉల్లాసంగా ఎలా లిఖించను
వ్యధసిరాకలంతో హాస్యాన్ని ఏం పండించను
గుండె ఇక్కడుండి ఎక్కడో ఎగసిపడుతుంటే
శ్వాస ఆడుతూ జీవించి మరణించి నేనుంటే
జీవితాన్నే శిక్షగాఇచ్చి విధివ్రాతని వెక్కిరించకు
అందమైన జీవితముందని ఆశను కలిగించకు

6 comments:

  1. గుండె ఇక్కడుండి ఎక్కడో ఎగసిపడుతుంటే
    శ్వాస ఆడుతూ జీవించి మరణించి నేనుంటే
    touching lines...

    ReplyDelete
  2. గుండె గొంతులో గుక్క తిప్పుకోలేక ఒక్క క్షణమాగిన ఫీల్ అనికేత్.. సింప్లీ సూపర్బ్..

    ReplyDelete
  3. manasuku sprushinchindi ..very nice

    ReplyDelete
  4. నేను అక్కడ ఉంటే నన్ను ఇక్కడ వెతక్కు
    చెల్లాచెదురై చిందిన అదృష్టాన్ని పోగుపెట్టకు
    అందమైన జీవితముందని ఆశను కలిగించకు

    ReplyDelete
  5. Excellent, ....my heart is overwhelmed with this

    ReplyDelete
  6. మీ మనోభావాలతో మనసుని కదిలించారు

    ReplyDelete