Sunday, November 10, 2013

పొమ్మంది

చదవడం రాయడం నేర్చి చాన్నాళ్ళైంది
మనసు నొప్పించక మాట్లడ్డమే రాకుంది

అనురాగ అల్లికల బాల్యపుస్తకం బాగుంది
లోకజ్ఞానాన్ని చదవడమే ఇంకా నేర్వకుంది

ఆదర్శాలని గమ్యాన్ని పోసిస్తూనే పెరిగింది
నలుగితోపాటు గంతలుకట్టుకుని నడవనంది

గాయపడ్డ హృదయం లోకాన్ని వెలివేసింది
అనామకంగా చావడానికైన సిధ్ధమే అనంది

నటించడం నేర్చుకుందామంటే తెలియకుంది
లోకానికి అర్థమయ్యే తాహతేలేదు పొమ్మంది


 

5 comments:

  1. నటించడం నేర్చుకుందామంటే తెలియకుంది
    లోకానికి అర్థమయ్యే తాహతేలేదు పొమ్మంది
    బాగుంది

    ReplyDelete
  2. గాయపడ్డ హృదయం లోకాన్ని వెలివేసింది
    అనామకంగా చావడానికైన సిధ్ధమే అనంది
    double like

    ReplyDelete
  3. ఆదర్శాల అద్దాలలోని
    అబద్దాలు ప్రతిబింబాన్ని వెక్కిరిస్తుంటే...
    నలుగురిలో తిరుగుతూనే...
    ఒంటరితనాన్ని దిగమింగుకుంటూ...
    అనామక జీవితం గడిపే...
    నటనలే ఒంటబట్టని...
    గాయాలు తప్ప మాయలు తెలియని...
    ముక్కుసూటి తమ్ముళ్ళ గురించి...
    ఎంతో చక్కగా...

    అభినందనలు...

    ReplyDelete
  4. ఎంతగానో కదిలించాయి అనికేత్ మీ మాటలు.
    చాలా బాగా అల్లావ్ నీ భావనల్ని .
    అభినందనలు
    *శ్రీపాద

    ReplyDelete