Saturday, December 14, 2013

గుర్తున్నాయి


గుర్తున్నాయి నీవులేక గడిచిన నిన్నమొన్నలు

ఓడినపోయిన ఓటములు, గెలిచిన విజయాలు!

గుర్తున్నాయి నీతోగడిపిన కొన్ని అపూర్వక్షణాలు

వచ్చిపోయిన వసంతాలు నీవులేని ఎండమావులు!

గుర్తున్నాయి నీవు ఆప్యాయంగా తాకిన స్పర్శలు

చలిలో ఊపిరిపోసుకున్న వేడిఉఛ్ఛ్వాస నిఛ్ఛ్వాశలు!

గుర్తున్నాయి నా తడారిన పెదాలపై నీ తీపిసంతకాలు

కనులతో కనులుకలిపి భావాలను వెతికిన నీ లోతట్లు!

గుర్తున్నాయి అన్ని నీవు లేనపటి ఈ క్షణాలు తప్ప....

10 comments:

  1. అనికేత్ గుండెని పిండేసావయ్యా.. మాటలు మూగబోయాయి.. love you

    ReplyDelete
  2. చివర్లో హృదయాన్ని హతుక్కునే ముగింపునిచ్చావు

    ReplyDelete
  3. గుర్తున్నాయి నీవులేక గడిచిన నిన్నమొన్నలు

    ఓడినపోయిన ఓటములు, గెలిచిన విజయాలు!

    గుర్తున్నాయి నీతోగడిపిన కొన్ని అపూర్వక్షణాలు

    వచ్చిపోయిన వసంతాలు నీవులేని ఎండమావులు!
    too good Aniketh

    ReplyDelete
  4. చాలా బాగుంది తమ్ముడూ

    ReplyDelete
  5. Chaalaa baagundi aniketh. Simply superb :-):-)

    ReplyDelete