Wednesday, February 19, 2014

ఇదే పరమార్ధమా?

మట్టితో బొమ్మను చేసి 

కలలతో అదృష్టాన్ని రాసి

నూలుపోగుతో బంధాన్ని వేసి

అందించే అనురాగానికి గిరి గీసి

బ్రతుకుకి స్వార్థపు రంగుని పూసి

సాగించే పయనం పేరే జీవించడమా

మనిషి పుట్టుకకు ఇదే పరమార్ధమా?

12 comments:

  1. ఓ బ్రహ్మయ్యా .... మట్టి బొమ్మకు .... ఈ కలల అదృష్టం, స్వార్ధం, అనురాగం, నూలుపోగు బంధాల జీవితమా!

    ReplyDelete
  2. ఇదే పరమార్థం కాకపోవచ్చు.

    ReplyDelete
  3. good.
    నా కవిత 'పయనం '(journey)కూడా చదివి స్పందించండి.

    ReplyDelete
  4. ఇదే పరమార్థం కాదు

    ReplyDelete
  5. ఎందుకో ఈ వేదాంతం :-)

    ReplyDelete
  6. ఏంటి ఈ వైరాగ్యం అనికేత్ గారు. :-)

    ReplyDelete
  7. పుట్టుకకు పరమార్థం ఖచ్చితంగా ఉండాలా??

    ReplyDelete
  8. మనిషి ఆశావాహ దృక్పథంతో ముందుకు వెళ్ళినప్పుడే జీవితానికి పరమార్ధం. నిరాశావాదం మనిషిని క్రుంగదీస్తుంది. ఏదెమైన మీ కవిత అలోచింపజేసింది.

    ReplyDelete

  9. "బ్రతుకుకి స్వార్థపు రంగుని పూసి

    సాగించే పయనం పేరే జీవించడమా"

    చాలా బాగా వచ్చింది మీ ఈ కవిత. కొనసాగనీయండి .
    శ్రీపాద

    ReplyDelete
  10. భావ గర్భిత మైన భావాలివి అనికేత్
    గొప్పగా ఉంది కవిత

    "అందించే అనురాగానికి గిరి గీసి

    బ్రతుకుకి స్వార్థపు రంగుని పూసి
    సాగించే పయనం పేరే జీవించడమా? "

    ఎంత నిఘూడమయిన పరమార్ధం మీ ఈ మాటల్లొ.

    *శ్రీపాద

    ReplyDelete