Saturday, October 5, 2013

ఆమె ఆయుధం

 
కాదంటూ ఒకసారి అవునని మరోసారి అలిగేవు
ఏదేమైనా అలిగిన నిన్ను బుజ్జగించడం ప్రియం

పొమ్మని రమ్మనే నీ ప్రేమతో ఊపిరి సలపనీయవు
ఎలాగన్నా నీవు నాపై చూపే అనురాగం అమోఘం

స్నేహమే కాని ప్రేమకానే కాదు పో పోరా అంటావు
ఎందుకో ఏమో అలా అంటుంటే నాకు నీవు ప్రత్యేకం

మితభాషినైన నా మాటల్లో ప్రేమకి సాక్ష్యం వెతికేవు
ఏం వెతికినా నీ కళ్ళలో కనిపించే వెలుగే నాకు జీవం

అభిమానులందరిలో నా ప్రేమని నీవు నమ్మకున్నావు
ఎంత వద్దనుకున్నా కావాలనిపించేలా ఉండేదే నీ గుణం

కోపం వస్తే ప్రాణం తీస్తానని బాకులు బాణాలు అడిగేవు
అలా చేయాలనుకుంటే నీ ఛీత్కారమే దానికి ఆయుధం!

9 comments:

  1. మితభాషినైన నా మాటల్లో ప్రేమకి సాక్ష్యం వెతికేవు
    ఏం వెతికినా నీ కళ్ళలో కనిపించే వెలుగే నాకు జీవం lovely feel

    కోపం వస్తే ప్రాణం తీస్తానని బాకులు బాణాలు అడిగేవు
    అలా చేయాలనుకుంటే నీ ఛీత్కారమే దానికి ఆయుధం! extraordinary.. congrats అనికేత్..

    ReplyDelete
  2. చక్కని భావాన్ని అందంగా పేర్చారు.

    ReplyDelete
  3. అందమైన భావాలకి అక్షరరూపం మీ కవిత, చవరి రెండు లైన్స్ ప్రాణం పోసాయి.

    ReplyDelete
  4. కాదంటూ ఒకసారి అవునని మరోసారి అలిగేవు
    ఏదేమైనా అలిగిన నిన్ను బుజ్జగించడం ప్రియం...nice feel

    ReplyDelete
  5. ప్రతి పదమూ అందమైన ఫీల్ ఇస్తుంది.
    చాలా ్బాగా రాశారు.

    ReplyDelete
  6. అనికెత్ suppppeeero super... చాలా చాలా బాగుంది..కేక రాశారు:-):-):-)

    ReplyDelete
  7. నీ జీవన పయనంలో ఎంతో నేర్చుకున్నావని నీ ఈ కవిత చెబుతుంది !
    ఇంత బరువైన పదజాలం ఎలా వస్తుంది నీకు అనికేత్.
    నిజంగా... చాలా... చాలా బాగుంది నాకీ కవిత.

    "మితభాషినైన నా మాటల్లో ప్రేమకి సాక్ష్యం వెతికేవు
    ఏం వెతికినా నీ కళ్ళలో కనిపించే వెలుగే నాకు జీవం"

    గుండెను కదిలించావ్ నీ ఈ మాతలతో.
    నీ కవితా ధారా ఇలాగే కొనసాగనీ
    *శ్రీపాద

    ReplyDelete