సూర్యకాంతికి విచ్చుకుని కమలం తెలుపుతుంది తనలోని ప్రేమను
అంతే కాని అది మధ్యాహ్నం వరకు వేచి ఉండదు...
చందమామను చూసి విప్పారే కలువం రాత్రంతా మేల్కొనిఉండదు.
మేఘాలతో బరువెక్కిన ఆకాశం వర్షిస్తుందే కానీ ధరణి పిలుపుకై వేచిఉండదు.
సాగరకెరటం అల అయి తీరంతో చేరి తిరిగి వెళ్ళకమానదు.
ఇలా....
ప్రకృతిలో లేని స్వార్థము, నిర్మొహమాటము కేవలము మనుషుల్లో మాత్రం ఎందుకో?
తన అనుకున్నవారు తమకే సొంతం కావాలని కోరుకోవడం ఎందుకో?
తమలోని భావావేశాలను చెప్పడానికి స్త్రీ, పురుషులు
అంటూ నిర్మొహమాట తారతమ్యాలెందుకో?
సహజసిధ్ధమైన కార్యాలకి ఇన్ని కట్టుదిట్టాలెందుకో?
ప్రకృతితో పాటుగా సృష్టించబడిన మనలో
ఇన్ని నియమనిబంధనలతో కూడిన బంధాలెందుకో?