Wednesday, May 2, 2012

ఏమికాను?

ఆహారమైపోవ నే శిభిని కాను
కవచకుండలాలివ్వ కర్ణున్ని కాను
నేలనివ్వ నేను బలిచక్రవర్తిని కాను

నా మదిలో చోటివ్వడం తప్ప
ఆనందింపచేసే ప్రయత్నం తప్ప
స్నేహానికి ప్రాణం ఇవ్వడం తప్ప

ధీరుడిలా కండల్ని చూప లేను
మేటి హీరోనై మెప్పించనూ లేను
మాటలతో నేను మురిపించ లేను

పదాలని అటువిటు కూర్చడం తప్ప
చిరునవ్వునై విరబూయాలనే తప్ప
మీతో ఇలా పంచుకోవలనే ఆశ తప్ప

6 comments:

  1. That is very cute!I liked it. start sharing mari .

    ReplyDelete
  2. well said Aniketh..this is the new trend set in current young generation..you are different and awesome..

    ReplyDelete
  3. చాలా బాగుందండీ!
    అత్యంత విలువయిన మదిలోని చోటే భాగ్యము కాదా!
    బాధతో నిండిన కనులకి ఆనంద భాష్పమే చాలదా!

    ReplyDelete