Wednesday, May 30, 2012

ఎందుకో?

సూర్యకాంతికి విచ్చుకుని కమలం తెలుపుతుంది తనలోని ప్రేమను
అంతే  కాని
అది మధ్యాహ్నం వరకు వేచి ఉండదు...
చందమామను చూసి విప్పారే కలువం రాత్రంతా మేల్కొనిఉండదు.
మేఘాలతో బరువెక్కిన ఆకాశం వర్షిస్తుందే కానీ ధరణి పిలుపుకై వేచిఉండదు.
సాగరకెరటం అల అయి తీరంతో చేరి తిరిగి వెళ్ళకమానదు.
ఇలా....
ప్రకృతిలో లేని స్వార్థము, నిర్మొహమాటము కేవలము మనుషుల్లో మాత్రం ఎందుకో?
తన అనుకున్నవారు తమకే సొంతం కావాలని కోరుకోవడం ఎందుకో?
తమలోని భావావేశాలను చెప్పడానికి  స్త్రీ, పురుషులు
అంటూ నిర్మొహమాట తారతమ్యాలెందుకో?
సహజసిధ్ధమైన కార్యాలకి ఇన్ని కట్టుదిట్టాలెందుకో?

ప్రకృతితో పాటుగా సృష్టించబడిన మనలో
ఇన్ని నియమనిబంధనలతో కూడిన బంధాలెందుకో?

8 comments:

  1. నిజమే చాలా బాగా చెప్పారు!

    ReplyDelete
  2. బాగుంది ఆలోచన...ఎప్పుడో ఆ కట్టుదిట్టాలు ప్రశ్నించుకునే రోజు రాక పోదేమో!

    ReplyDelete
  3. బాగున్నాయి మీరు సంధించిన ప్రశ్నల శర పరంపర..
    సూటిగా వున్నాయి...
    తప్పక వీటిని ఎవరికి వారు తమకు తాము వేసుకొని జవాబు చెప్పుకోవాల్సినవే...

    ReplyDelete
  4. ఇదేదో చాలా సుధీర్గంగా ఆలోచించవలసిన విషయమే:-)

    ReplyDelete
  5. essayer difficile de comprendre le concept, mais la photo est impressionnante

    ReplyDelete
  6. చక్కటి ప్రశ్నల పత్రం..:-)...బాగుంది మీ కవిత అనికేత్ గారూ!
    ఎందుకంటే....
    మనం ప్రకృతికి దగ్గరగా ఉండడం మానేసి ఎన్నో దశాబ్దాలు దాటిపోయింది
    మననుంచి ఏమీ ఆశించకుండా మనకన్నీ ఇచ్చేది ప్రకృతి...
    మనం, ప్రకృతి వేరు కాదు...మనం ప్రకృతిలో ఒక చిన్న అంశ మాత్రమే.
    మనం సహజత్వానికి దూరంగా ఉంటాం...
    అందుకే మనం నిర్మించుకున్న కట్టుబాట్ల గోడల మధ్య మనమే బందీలం...
    @శ్రీ

    ReplyDelete