Saturday, June 16, 2012

ఓ!!! నాన్న

నా జన్మకు కారణమైన....ఓ!!! నాన్న

మీ భావాలతో నేను ఏకీభవించకపోవచ్చు

అవి మన మధ్య తరాల అంతరమైఉండొచ్చు

కూతురిలా అభిమానాన్ని తెలపలేకపోవచ్చు

కాని...

నన్ను ఎత్తుకుని ముద్దాడిన మీ చేతులు

నాలో మిమ్మల్ని చూసుకుని మురిసినవైనాలు

నా తప్పుల్ని సరిదిద్ది నాకు మార్గం చూపిన ప్రేమ

నా ఉన్నతికై మీరు పడిన శ్రమ....గుర్తున్నాయి నాన్న



లోకం తీరు తెలిపిన.....ఓ!!! తండ్రీ

యువరక్తం నాలో రేపిన చంచలమైన చిచ్చు

అమ్మతో మీపై ఫిర్యాదులెన్నో చేసి ఉండొచ్చు

మిమ్మల్ని నొప్పించి మీకన్నా ఏపుగా ఎదగొచ్చు

కానీ...

నాతోపాటు మీరు సంబరంగా వేసిన కుప్పిగంతులు

నా మీసాలనుచూసి మెలితిరిగిన మీ గుబురుమీసాలు

నన్ను ఇంతటివాడ్నిగా మలచిన మీ సజలనయనాల్లో

దాగిన నాపై మీకున్న వాత్సల్యము....గుర్తున్నాయి తండ్రీ



ఎంతటివాడినైనా...ఓ!!! పితా

అందరూ నన్ను మీకన్నా గొప్పవాడిననొచ్చు

రేపు నన్ను మించిన వాడికి నేను తండ్రినికావొచ్చు

స్వార్థమో, సమయభారమో మనిరువురిని దూరంచేయొచ్చు

కానీ...

మీ ఆలనలో పొందిన ఆప్యాయానురాగాలు

మీరు చూపిన అనుకూలమైన ఆదర్శమార్గాలు

నేను అవలంభించవలసిన నియమనిబంధనలు

మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ....గుర్తుంటాయి పితా!



"నా ఉనికి కారణం నీవే, నా కధానాయకుడివి నీవే"
                                       ఇది మీకే అంకితం.....
"పితృదినోత్సవ శుభాకాంక్షలు"

17 comments:

  1. ఏ తరమైనా తన ముందు తరాన్ని గుర్తుంచుకొని గౌరవించి ప్రేమించేలా నాన్న గురించి మీరు తెలిపిన అనుభూతులు చాలా గొప్పగా వున్నాయి.. మీవంటి సుపుత్రున్ని కలిగిన ఆ నాన్న ఎంత అదృష్టవంతుడో...Happy Father's day..

    ReplyDelete
    Replies
    1. నేను కూడా అదృష్టవంతుణ్నే కదండీ.:-)

      Delete
  2. చాలా బాగుంది మీ తండ్రికి మీరు అంకితమిచ్చినకవిత.

    ReplyDelete
  3. చాలా బాగుంది అనికేత్...
    మీ భావాలు కవితలో బాగా కూర్చారు...
    అభినందనలు మీకు.
    @శ్రీ

    ReplyDelete
  4. చాలా చాలా బాగుంది మీ కవిత..... సూపర్ ....

    ReplyDelete
  5. happy fathers day,
    bhagudandi mee kavitha, keep writing.

    ReplyDelete
  6. kavita chaalaa baavundi miku kuda happy fathers day andi

    ReplyDelete
  7. మీ భావ వ్యక్తీకరణ లోని నిజాయితి ,తండ్రి పట్ల మీ జ్ఞాపకాలు చాలా గొప్పగా వున్నాయి.

    ReplyDelete
  8. aniket gaaroo chaalaa baagaa raasaaru, nijamgaa naannani kathaanayakudigaa srustinchi .

    ReplyDelete