Wednesday, December 5, 2012

నీవుంటే

నిన్నుగాంచిన నామనసు అంది
రంగుల లోకం నా కళ్ళల్లోనే ఉంది
పరిమళమై గిలిగింత పెడుతున్నావు
ప్రేమగీతమై నన్ను అలరిస్తున్నావు
నిరీక్షణ ఫలించి కల నిజమైనట్లుంది
అంతలోనే నిజమో కాదో అనిపిస్తుంది
గుండెలో సవ్వడిలా ప్రతిధ్వనిస్తున్నావు
వెలుగు రేకై చీకటిలో కనబడుతున్నావు
నాతో ఉంటే నీవు ప్రేమకావ్యమే వస్తుంది
కాదంటే మరణించి మరల జీవించాలనుంది.

7 comments:

  1. మీ యువ హృదయాన్ని ఆవిష్కరించారు అనికేత్...
    కానీ అలా డీలా పడొద్దు...:-)
    తప్పక ప్రేమ ఫలిస్తుంది...

    ReplyDelete
  2. చిత్రం చాలా బాగుంది... ప్రొఫైల్ పిక్ గా పెట్టొచ్చు కదా...

    ReplyDelete
  3. ఏదో వెలితిగా ఉంది కవితలో కానీ భావం బాగుంది.

    ReplyDelete
  4. నా స్టేజ్ లోనే ఉన్నారన్నమాట....సేం టు సేం:-)

    ReplyDelete