Thursday, November 22, 2012

అస్లీ-నక్లీ

ఈ లోకంలో అవసరాన్నిబట్టి మారుస్తారు వారి వారి రూపం
అందుకే మాస్క్ వేసుకుని మనసుని దాచింది నా ముఖం

ఈ లోకానికి నచ్చేలా ఉండలేనంది నా సిసలైన రూపం
అందుకే అందరూ మెచ్చేలా ముసుగేసుకుంది నా ముఖం

ఈ లోకాన్ని ఆకట్టుకుంది రంగులు మారిన నకిలీ రూపం
అవసరానికి ముఖకవళికలు మార్చి నటించే నా ముఖం

ఈ లోకాన్ని వద్దని వెలివేసింది నాలోని నా అసలు రూపం
అనైతికంగా పతనం కాలేనని పారిపోయింది నా ముఖం

ఈ లోకంలో నేను నేనుగాలేనని నన్ను వీడింది నా రూపం
అస్తిత్వాన్ని వెతుకుతూ ఎటో వెళ్ళిపోయింది నా ముఖం

ఈ యాంత్రిక జీవనపయనంలో గుర్తులేదు నా అసలు రూపం
అలా అంతమై నన్ను అనామకుడ్ని చేసింది నా ముఖం

10 comments:

  1. ఈ లోకాన్ని వద్దని వెలివేసింది నాలోని నా
    అసలు రూపం
    అనైతికంగా పతనం కాలేనని పారిపోయింది నా
    ముఖం...
    fabulous...no words to give reply aniketh...my warm hug to u...

    ReplyDelete
  2. మరో మాస్క్ తో బ్రతుకుతున్న మనుషులెందరో మనమధ్య!!!

    ReplyDelete
  3. చాలా అద్భుతంగా రాసావు అనికేత్ మాస్క్ వేసుకోకుండా...అభినందనలు

    ReplyDelete