Saturday, March 30, 2013

జిజ్ఞాస...


చదవడం వ్రాయడం నేర్చుకున్నా
అక్షరాలతో  ఊసులే అల్లుతున్నా
అయినా మనసెందుకో వికశించదు
సరైన గమ్యం ఏదో నాకు తెలియదు
భావ వ్యక్తీకరణకు సాధనాలు తెలీవు
ప్రణాలికతో పదాలు పేర్చినా అమరవు
ఇది నా అవగాహనా లోపమనుకుంటా
అందుకే పదేపదే నన్ను నే తిట్టుకుంటా
నేర్వాలన్న జిజ్ఞాసతో మళ్ళీ ప్రయత్నిస్తా
మెప్పించే కవితని ఎప్పటికైనా నే లిఖిస్తా!

Friday, March 8, 2013

నీవు రావా!

చెక్కిలి నిమిరిన చేతులే
శూన్యంలోకి తోసేసాయి
కరుణ చూపిన నయనాలే
అగ్ని కణాలై వర్షించాయి
నవ్వులు చిందిన అధరాలే
మౌనంగా బంధించేసాయి
గడిపిన మధుర క్షణాలే
స్మృతులై వేధిస్తున్నాయి
చెలిమి నీడలు నన్నంటి
నీకై ఎదురు చూస్తున్నాయి