Thursday, October 31, 2013

ఆమె

ఆమె పెదవి నా పెదవి తాకిన వేళ
ముద్ద మింగకుండానే ఆకలి తీరింది

ఆమె అలవోకగా ప్రేమించాను అనిచెప్పి
తప్పు చేయాకుండానే ఖైధీగా బంధించేసింది

ఆమె తన కౌగిలో నన్ను బంధించిన వెంటనే
ప్రాణం పోలేదు కాని జీవితం స్వర్గాన్ని చేరింది

Saturday, October 5, 2013

ఆమె ఆయుధం

 
కాదంటూ ఒకసారి అవునని మరోసారి అలిగేవు
ఏదేమైనా అలిగిన నిన్ను బుజ్జగించడం ప్రియం

పొమ్మని రమ్మనే నీ ప్రేమతో ఊపిరి సలపనీయవు
ఎలాగన్నా నీవు నాపై చూపే అనురాగం అమోఘం

స్నేహమే కాని ప్రేమకానే కాదు పో పోరా అంటావు
ఎందుకో ఏమో అలా అంటుంటే నాకు నీవు ప్రత్యేకం

మితభాషినైన నా మాటల్లో ప్రేమకి సాక్ష్యం వెతికేవు
ఏం వెతికినా నీ కళ్ళలో కనిపించే వెలుగే నాకు జీవం

అభిమానులందరిలో నా ప్రేమని నీవు నమ్మకున్నావు
ఎంత వద్దనుకున్నా కావాలనిపించేలా ఉండేదే నీ గుణం

కోపం వస్తే ప్రాణం తీస్తానని బాకులు బాణాలు అడిగేవు
అలా చేయాలనుకుంటే నీ ఛీత్కారమే దానికి ఆయుధం!