Saturday, September 2, 2017

ఇసుక పువ్వు

నేను ఒక ఇసుక పువ్వును 
అందినట్లే అంది చేజారిపోతాను
నాకు ఏ బాదరా బంధీలు లేవు
ఆకుల వంటి అనుబంధాలు లేవు
నిలకడ లేని అనిశ్చల రూపం  
గాలికి ఎగిరే ఎడారి జీవితం  
నిర్వికారంతో ఏ పరిమళం లేక 
విచ్చుకున్న ఇసుక పువ్వును.. 

7 comments:

  1. అనికేత్ హార్ట్ టచింగ్

    ReplyDelete
  2. ఇసుక పువ్వులు...ఆర్ద్రతను నింపారు.

    ReplyDelete
  3. నమస్కారం _/\_
    మీ బ్ల్లాగ్ కూడలిలో కలుపబడింది. http://koodali.club/
    తెలుగు సాహిత్య ప్రియులను, బ్లాగ్ లోకంలో తెలుగు నెటిజన్లను మరియు ఎంతో మంది బ్లాగర్లను పరిచయం చేసిన 'కూడలి' అగ్రిగేటర్ అస్తమయం అవడం అందరికీ బాధ కలిగించింది. కూడలి లేని లోటును ఎన్నో తీరుస్తున్నా, దానికి అలవాటుపడ్డ వారు మాత్రం నైరాశ్యంతోనే ఉన్నారు. ఆ లోటును తీర్చడానికి కొంతవరకూ చేసిన ప్రయత్నమే ఈ కూడలి.క్లబ్ http://koodali.club/

    కూడలి.క్లబ్ ని మీ బ్లాగులో జత చేయగలరు.

    ReplyDelete
  4. ఇసుకలో విత్తనమే మొలవదు పువ్వు పూయడం కల

    ReplyDelete
  5. సున్నిత మనస్కులు మీరు.

    ReplyDelete