Wednesday, November 15, 2017

నీతో నేను

నీ అరవిరిసిన మోమును చూసా
అధరాలు కనులతో పాటు చెప్పిన 
అందమైన ఊసులు ఎన్నో విన్నా 
గంధర్వుడిని కాను నిన్ను స్తుతించ  
కవికోవిదుడను కాను నిన్ను వర్ణించ 
తత్వవేత్తను కాను నీతో తర్కించ 
ముసుగులో భావాలను దాచుకోలేను 
కోర్కెల్ని ఎదలో బంధించి మోయలేను   
మంత్రం వేసినట్లు నీ వైయనం తిలకిస్తాను 
ఏమైనా జరగనీ అంటూ ఊహల్లో విహరిస్తాను!

5 comments:

  1. ఏది ఏమైనా చేస్తానని తుది నిర్ణయం ఇచ్చేసారు..బాగుంది.

    ReplyDelete
  2. కోర్కెల్ని ఎదలో బంధించి మోయలేను

    ReplyDelete
  3. Nice Blog

    It is useful for Everyone

    DailyTweets

    Thanks...

    ReplyDelete