Sunday, December 10, 2017

నిదురపో

సందెపొద్దు వాలి సందడంతా సోలిందీ 
అందరాని అంబరాన్న చందమామ తేలిందీ
జ్ఞాపకాలకు జోలపాడుతాను అనంటే వద్దంది  
నిదురపో అంటూ అలసిన శరీరం అంటుంది 
భాషరాని బాధలు గోలచేస్తూ నిదుర రానంది  
ఎంత అలసిపోయేయో నా ఆలోచనలు 
అలుపుతీరేలా కనుల నిదురపోదాం రమ్మంది 
కమ్మనికల కంటూ నిదురపొమ్మని జాబిలి అంది 

6 comments:

  1. హాయిగా నిదురపొండి.

    ReplyDelete
  2. నిదురరాని కనులకు నిదుర తెప్పించారు.

    ReplyDelete
  3. ఓహో భాషరాని బాధలూ ఉంటాయా.

    ReplyDelete
  4. Nice Blog

    It is useful for Everyone

    DailyTweets

    Thanks...

    ReplyDelete