జీవితం ఎంత ఉల్లాసంగా సాగిపోతూ వుంటుందో అప్పుడప్పుడూ బ్రేక్స్ పడేసరికి ఆ కుదుపుకు మనం నిలబడ్డామా లేదా అన్నదే కదా మనల్ని నిరూపించేది. ఏమైనా ఎన్నైనా తట్టుకొని నిలబడడం నేటి తరానికి అవసరం. రోజు వారీ పనుల వత్తిళ్ళ మధ్య కాస్తా విశ్రాంతి కోరుకుంటుంది మనసు. కానీ వీకెండ్ వరకు ఆగాల్సిందే. ఎందుకంటే పగటికి రాత్రికి తేడా తెలీకుండా బ్రాయిలర్ కోళ్ళలా పెరుగుతాం కాన్సెప్ట్ స్కూళ్ళతో మొదలై కార్పొరేట్ కాలేజీలతో ముగిసిందనుకుంటే మరలా నొప్పి తెలీకుండా రక్తం పీల్చే జలగల్లాంటి మల్టీ నేషనల్ కంపెనీలలో గానుగెద్దుల్లా పడి. చివరగా ఆ శనివారమొచ్చిందంటే నాన్నో అమ్మో ఏదో ఒక వంకతో బయటకు పోతే ఏ పబ్ కో ఊరవతల షికార్లకో పోతారనుకొని మనకు ముందే ముందరి కాళ్ళకు బంధం వేసే అత్యవసర పనులు సృష్టించి వుంటారు. అయినా ఆ కల్చర్ కూడా జేబుకు, ఒంటికి చిల్లు పడేదే కదా అని సరిపెట్టుకున్నా మనసుకు హాయినిచ్చే సమయం కరువాయె. ఇన్ని వత్తిళ్ళ మధ్య యువత జీవితం మరో ఆలోచన లేకుండా గడిచిపోతోంది. సమకాలీన రాజకీయార్థిక సామాజిక తీరు తెన్నుల గురించి ఆలోచించే సమయం లేకుండా చేయడం కూడా ఓ కుట్రేనేమో అనిపిస్తుంది. మనలో దినపత్రికలు చదివే వాళ్ళెంతమంది? స్పోర్ట్స్ పేజీనో, సినిమా పేజీనో చూసి పక్కన పడేసే వాళ్ళమే కదా? యిదంతా అవసరమా అనికేత్ అంటే అవసరమే అంటాను ఫ్రెండ్స్.
సమకాలీన రాజకీయార్థిక సామాజిక తీరు తెన్నుల గురించి ఆలోచించే సమయం లేకుండా చేయడం కూడా ఓ కుట్రే,అంతేనంటారా.....
ReplyDeleteయువతను మార్గ నిర్దేశం చేసే యూత్ ఫుల్ పోస్ట్ లు మరిన్ని రాయండి అనికేత్...బాగుంది...అభినందనలు..
ReplyDeleteMan born free but every where he is in chains అన్న రూసో మాటలు నేటికీ అక్షర సత్యాలే కదా..కానీ అధిగమించి ముందుకు పోవాలి భవిష్యత్తరమైన మీలాంటి యువతరం..
ReplyDeleteబహుశా అలా అంత బిజీ షెడ్యూల్ అవసరమేమో కదా నేటియువతరానికి:-)
ReplyDeletekeep on sharing your views....
ఇదే ఫాస్ట్ ట్రెండ్ ని యువతరం కోరుకుంటూ దానికి ఫాషన్ అని జెనరేషన్ గాప్ అని అంటుందేమో కదా?
ReplyDeleteGood post from you.