Sunday, August 26, 2012

అవిటివాడినై



శుభోదయమంటూ మేల్కొల్పావు అప్పుడెప్పుడో నన్ను
నాటి నుండి నేటిదాకా నిదురపోలేక పోయాను ....
ఇదిమరి నా వెర్రితనమో లేక ప్రేమకున్న మాయరోగమో
నీవు చేసిన వెలితిని పూరించాలకున్నా జోడీనై మరొకరికి
నీహృది ఎంగిలి కూడంటూ మరోమనసు కాదంటోంది నన్ను
మనసునేకాదు నన్నునేను సముదాయించుకున్నాను...
ఇదిమరి నా దురదృష్టమో రాత రాసినవాడి చేతకానితనమో
నీ మౌనపుహోరు మాత్రమే వినిపిస్తుంది నా చెవిటితనానికి
నీ చెలిమితో మురిపించి సేద తీర్చావు ఒంటరినైన నన్ను
మరోలోకం చూపి మరలిరాక నన్ను ఒంటరిని చేసావు...
ఇదిమరి నేను జీవితంలో ఓడిపోవడమో లేక పైవాడి విజయమో
గమ్యం ఏమిటో తెలియని అవిటివాడినై మిగిలానిలా చివరికి!!!

6 comments:

  1. అనికేత్ ఏంటి ఒంటరితనం మీకా???:-) కొంచెం ఇబ్బంది పడుతున్నారేమో!
    But expressions are good keep writing.

    ReplyDelete
  2. నీ మౌనపుహోరు మాత్రమే వినిపిస్తుంది నా చెవిటితనానికి
    అద్భుతమైన ప్రయోగం...
    కవితాభావం చాలా బాగుంది...
    అభినందనలు అనికేత్...
    @శ్రీ

    ReplyDelete
  3. "నీహృది ఎంగిలి కూడంటూ మరోమనసు కాదంటోంది నన్ను" ఒకరికి ఇచ్చిన మనసు ఇంకొకరికి ఇవ్వలేనని ఎంత బాగాచెప్పారండి.





    ReplyDelete
  4. wow...beautiful expression Aniketh...
    ఈ భావం కవిత వరకే పరిమితం కావాలని కోరుకుంటున్నా...Rock as you are....

    ReplyDelete
  5. wow this is the feel of mine too aniketh:)

    ReplyDelete
  6. వేదనలోను మంచి భావం...

    ReplyDelete