Tuesday, September 11, 2012

చివరివరకు.

 వ్రాయాలనుకున్నంత మాత్రాన్న రాసేయగలనా
ఓనమాలు దిద్దుతూ గ్రంధాలగూర్చి చర్చించగలనా
మదిలోన ఆశలెన్నో ఉదయించినా అవన్నీ ఫలించేనా
బ్రతికే ప్రయత్నంలో భాషరాని భావాలని అణిచేయనా
చీకటిన బంధించి ఒంటరి మనసుని భావమేమడిగేది
చమురులేని దీపాన్ని వెలుగులు విరజిమ్మనేలకోరేది
వెన్ను ఉదరము ఒకటై ఆకలితో అల్లాడే వాడిగురించి
కడుపునిండి కాలుచాపుకున్నవాడికి ఏమని వివరించేది
వేటలో వింటికి చిక్కిన హరిణి గోలచేసి గొంతెత్తి అరిచినా
వినిపించుకోని విల్లుకారుడు దాన్ని జాలితో విడిచిపెట్టేనా
జీవనపయనం ఒడిదుడుకులతో ఎటువైపు సాగిపోయినా
నిరాశచెందక గమ్యంకొరకై అంతంవరకూ ప్రయత్నించనా!

8 comments:

  1. భావాలు చాలా బాగున్నాయి అనికేత్ గారూ!
    "చీకటిన బంధించి ఒంటరి మనసుని భావమేమడిగేది
    చమురులేని దీపాన్ని వెలుగులు విరజిమ్మనేలకోరేది"
    చక్కగా చెప్పారు...
    @శ్రీ
    గమనిక:'విలుకాడు' గా సరిచేసుకోండి.

    ReplyDelete
  2. జీవితమే ఒక నిరంతర ప్రయత్నం, కొనసాగించండి ఆనందంగా.....

    ReplyDelete
  3. మదిలోన ఆశలెన్నో ఉదయించినా అవన్నీ ఫలించేనా
    బ్రతికే ప్రయత్నంలో భాషరాని భావాలని అణిచేయనా
    చక్కగా చెప్పారు...

    ReplyDelete
  4. చీకటిన బంధించి ఒంటరి మనసుని భావమేమడిగేది
    చమురులేని దీపాన్ని వెలుగులు విరజిమ్మనేలకోరేది...excellent Aniketh..
    గమ్యం కొరకు అంతం వరకు ప్రయత్నించడమే జీవన సాఫల్యం కాదా?? simply superb Aniketh...

    ReplyDelete
  5. పలకలేనంటూనే భావాలని భలే పలికిస్తున్నారు.

    ReplyDelete
  6. చీకటిలోనే ఇంతలా భావాలను పలికితే ఇంక వెలుగులో ఇరగదీస్తారేమో అనికేత్ గారూ:) చక్కని భావం, కవితబాగుందండి!

    ReplyDelete