Thursday, October 11, 2012

ఈ అనుభవమేదో


తెలవారిందంటూ తెల్లనిమెరిసే చీరతో
అందాల సుగంధాలతో....వేడి వేడి కాఫీని
నవ్వుతూ అందించె గలగలమనె గాజులచేతితో
మగతన నా కళ్ళు మరల మత్తెక్కెను ఈ చర్యతో

ముసిముసి నవ్వుల కనుదోయలు,
చెంపలని ముద్దాడుతున్న ఆ ముంగురులు
ముద్దాడవేలంటూ ప్రశ్నించే వణికే ఆమెపెదవులు
వయ్యారి వాలుజడను హత్తుకున్న విరజాజులు
ఆమెను హత్తుకోను విరహమేలంటూ చేసెనెన్నో సైగలు

చేయందుకోబోయి మంచంపైనుండి పడ్డాను కెవ్వుకేకతో
పదిగంటలు కొట్టిన అలారం తెలిపింది.... నా నడ్డివిరిగిందని
కళ్ళు తెరచిచూడ ఒక కలగా మిగిలెను ఈ అనుభవమేదో:-)

7 comments:

  1. ...:-)....
    hahaha....baagundi aniket gaaroo!...@sri

    ReplyDelete
  2. hmmmmm చివరికి అలా ముగిసిందన్నమాట:)

    ReplyDelete
  3. ఓహ్...ఝండూ బాం అనుభవమా...:-)
    ఇలా కలను పంచుకుని నవ్వించినందుకు అభినందనలు అనికేత్....

    ReplyDelete
  4. మీ అందమైన కలను మాతో పంచుకున్నందుకు థాంక్స్ అండీ!
    త్వరగా మీ కల నెరవేరాలని కోరుకుంటున్నా.. (అప్పుడు మరిన్ని అందమైన కవితలు చెబుతారని.. :) )

    ReplyDelete
  5. అయితే త్వరలో కలనిజమవ్వబోతుందన్నమాట....నిద్రపోయే ముందు పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుని పడుకోండి.....నిద్రలో నడుమువిరిగితే:-)

    ReplyDelete