Saturday, May 17, 2014

ఆమెతో నేను

ఆమె నవ్వితే ముత్యాలు రాలునంట
నవ్వించి నడమంత్రపు సంపన్నుడినౌతా

ఆమె కంటి ఊసులు కవితాగానాలంట
కనులతో కనులు కలిపి ఊసులాడుతా

ఆమె  మోము అద్దానికి ప్రతిరూపమంట
మనసుని అలంకరించి ఎదురు నిలబడతా

ఆమె పెన్నిధి చలువ కలువ కౌగిళ్ళంట
మండేగుండెను ఆర్పమని దాసోహమౌతా

ఆమె నడక జాలువారే జలపాతమంట
కలసిరానికాలం ఆమె అడుగులో అడుగౌతా

ఆమెతో జీవితం అందమైన ఊహలసౌధమంట
నిజమంటే కనులు తెరచి కలగంటూ కైవసమౌతా

6 comments:

  1. ఆమె పెన్నిధి చలువ కలువ కౌగిళ్ళంట
    మండేగుండెను ఆర్పమని దాసోహమౌతా.. lovely feel.. nice pic..

    ReplyDelete
  2. ఆమెతో మీరు....అందమైన ఊహాగానమే :-)

    ReplyDelete
  3. ఆమె మీరు ఒకరికొకరు పర్ఫెక్ట్

    ReplyDelete
  4. అనికేత్
    శభాష్ ....
    చాలా బావుంది.

    ఊహల్లొ నీవు నిర్మించన భావనల బాట
    నీ మృదు స్వభావాన్ని చూపించింది.
    దానితో పాటు ఎంతటి శిఖరాన్నైనా అధిరోహించే
    దృడ విస్వాసాన్ని కూడా వినిపించావ్
    మంచి రాగంతో .

    మంచి కవితనిచ్చావ్.
    అభినందనలు అనికేత్.
    *శ్రీపాద

    ReplyDelete
  5. మీ హృదయ రాగ సౌరభం కవితా రూపంలో ఇంకా అందంగా దర్శనమిచ్చింది మిత్రమా..

    ReplyDelete