నేనెప్పుడూ ఓటమిని కౌగిలించుకున్న ఒంటరిని
కలల ఎరల వలల ఉచ్చులో చిక్కిన బాటసారిని
రాగం ద్వేషం స్వార్థ మత్తు వ్యసనాలకి బానిసని
నైతికపతనమై అంబరమంటని నిస్సహాయుడిని
ఎత్తులకు కుయ్యెత్తులు వేయలేని అయోగ్యుడిని
మాటల బాణాలు సంధించలేని సమరయోధుడిని
మనసుండి కూడా ప్రేమించలేని భగ్నప్రేమికుడిని
ఇన్ని వైఫల్యాల వైకల్యమున్న నిండైన విగ్రహాన్ని
అయినా చెక్కుచెదరక సాగిపోతున్న ఒక సంచారిని

ఓ సంచారీ...నెగటివ్స్ కు స్వస్తి పలికి జీవితాన్ని అందంగా మలుచుకో ..వైఫల్యమున్నా, వైకల్యమున్నా నీ మీద నీవు నమ్మకం పెంచుకో..విజయతీరాల వైపు దూసుకుపో...
ReplyDeleteఓ బాటసారీ !
ReplyDeleteఏమిటీ నిర్లిప్తత నీడలు నీలో ?
మీ కవితలో మీ (మా) సంచారి నచ్చాడు.
అదే అతనిలో ఉన్న అనంత ;ఆత్మస్థైర్యం; .
ఆతని పయనం అలాగే కొనసాగనీయండి ...
గంపెడు సాధించగల ఆశయాలతో.
వైఫల్యాల వైకల్యాన్ని అధిగమించే మరో
సమర యోధిడిని అందించండి.
చాలా బాగా కుదిరింది మీ కవిత.
అభినందనలు.
*శ్రీపాద
అదేంటి ఫేస్ చూస్తే చిన్నగా ఫీలింగ్స్ చూస్తే భారంగా ఉన్నాయి. :-) but good kavita
ReplyDelete