Thursday, April 11, 2013

నీవడిగావు

జీవితం ఏమిటని నీవడిగావు?
నీవు లేనిది జీవితమే లేదని!
భాధేమని మరల ప్రశ్నించావు?
నాతో నీవులేని జీవితమే అదని!
ప్రేమంటే ఏమిటని నీవడగావు?
నాలో నీపై ఉన్నదంతా అదేనని!
దైవం అంటే ఏమిటని అడిగావు?
నేను కొలిచే ప్రేమదేవతవే నీవని!
ప్రేమించావెందుకని ప్రశ్నించావు?
నేనన్నాను అది నాక్కూడా తెలీదని!
ఎందుకింత తపన నేనంటే అన్నావు?
తెలిపా నేరం నాదికాదు నామనసుదని!

Saturday, March 30, 2013

జిజ్ఞాస...


చదవడం వ్రాయడం నేర్చుకున్నా
అక్షరాలతో  ఊసులే అల్లుతున్నా
అయినా మనసెందుకో వికశించదు
సరైన గమ్యం ఏదో నాకు తెలియదు
భావ వ్యక్తీకరణకు సాధనాలు తెలీవు
ప్రణాలికతో పదాలు పేర్చినా అమరవు
ఇది నా అవగాహనా లోపమనుకుంటా
అందుకే పదేపదే నన్ను నే తిట్టుకుంటా
నేర్వాలన్న జిజ్ఞాసతో మళ్ళీ ప్రయత్నిస్తా
మెప్పించే కవితని ఎప్పటికైనా నే లిఖిస్తా!

Friday, March 8, 2013

నీవు రావా!

చెక్కిలి నిమిరిన చేతులే
శూన్యంలోకి తోసేసాయి
కరుణ చూపిన నయనాలే
అగ్ని కణాలై వర్షించాయి
నవ్వులు చిందిన అధరాలే
మౌనంగా బంధించేసాయి
గడిపిన మధుర క్షణాలే
స్మృతులై వేధిస్తున్నాయి
చెలిమి నీడలు నన్నంటి
నీకై ఎదురు చూస్తున్నాయి

Tuesday, February 5, 2013

దూరం

దూరాల భారం మనకి అడ్డంకి కాదు
మనోఊసులకు దూరమర్మమే లేదు
నీ ప్రేమ వ్యసనానికి నేను బానిసను
అందుకే నలుగురిలో ఒంటరినైనాను

దూరాన్న ఉండి నా ఎదకి దగ్గరైనావు
ఇలా ఎలా నా ఎదని దోచేయగలిగావు
ఏ మంత్రమేసి నన్ను మాయ చేసావో
నేను నేనుగా కాక నీకు సొంతమైనాను

దూరమైనానని నా ప్రేమను కాదనకు
నాస్వఛ్ఛమైన ప్రేమని నీవు మరువకు
అనురాగాన్ని ఆకతాయి అల్లరనుకోకు
కలనైనా నన్ను వదిలేసి వెళ్ళిపోకు....

Thursday, January 10, 2013

అంతా భ్రాంతి

నేను ఆలోచిస్తున్నది అంతా భ్రాంతియేనా!
నా బుర్ర ఒక అంతుచిక్కని ప్రశ్నల ఖజాన
భగవంతుడొక్కడే రూపాలు అనేకమెందుకు
మానవులంతా ఒకటైతే ఈ జాతిబేధాలెందుకు
నాదన్న స్వార్థముంటే ప్రగతిని సాధించగలమా
మనమంతా నేను నుండి మేముగా మారలేమా
పుట్టి పెరిగి పోయే ఈ మూడ్నాళ్ళ ముచ్చటలో
మధ్యలో పెరగడంపైనే మనకి ప్రాముఖ్యతెందుకో!
చివరికి మనం మోసుకెళ్ళేదంతా శూన్యమైయితే
నాది నాది అంటూ ఈ తగని పోరాటం ఎందుకంట
లేనోడు లేకేడిస్తే ఉన్నోడికింకా కావాలని ఉరుకులాట
ఈ ప్రాకులాటలో సుఖాన్ని మరచి దుఃఖానికి చేరువై
జీవితాన్నిసాగిస్తూ దుఃఖంలో సుఖానికై వెదుకులాట!!!

Saturday, December 22, 2012

ఎవరికేం....


కవికి తెలుసు అక్షరంలోని భావం
చదివే వారికేం....
మనసున్నోనికెరుక మానవత్వమేంటో
మృగానికేం....
తాగుబోతుకెరుక మత్తులో గమ్మత్తు
తాగించే వాడికేం....
కలసి విడిపోతే తెలుస్తుంది బంధమేంటో
ఒంటరివాడికేం....
సంపాదించేవాడికెరుక సొమ్ము విలువ
ఖర్చుచేసే వారికేం....
నమ్మేవారికెరుక నమ్మకమంటే ఏమిటో
మోసగాడికేం....
కఠినంగా శిక్షిస్తే తెలుస్తుంది న్యాయమేంటో
శిక్షపడని వాడికేం....

Wednesday, December 5, 2012

నీవుంటే

నిన్నుగాంచిన నామనసు అంది
రంగుల లోకం నా కళ్ళల్లోనే ఉంది
పరిమళమై గిలిగింత పెడుతున్నావు
ప్రేమగీతమై నన్ను అలరిస్తున్నావు
నిరీక్షణ ఫలించి కల నిజమైనట్లుంది
అంతలోనే నిజమో కాదో అనిపిస్తుంది
గుండెలో సవ్వడిలా ప్రతిధ్వనిస్తున్నావు
వెలుగు రేకై చీకటిలో కనబడుతున్నావు
నాతో ఉంటే నీవు ప్రేమకావ్యమే వస్తుంది
కాదంటే మరణించి మరల జీవించాలనుంది.